ఐదవ శక్తిపీఠమైన శ్రీశ్రీశ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం నందు నేడు ఏకాదశి సందర్భంగా శ్రీ జోగులాంబ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అనంతరం తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అలంపూర్ మండల ఎస్సై వెంకటస్వామి ప్రత్యేక బందో బస్తును ఏర్పాటు చేశారు. మొహరం పండుగ ఉండడంతో మత ఘర్షణలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎసై వెంకట స్వామి తెలిపారు