అసిఫాబాద్: పురుగు మందు తాగి గంగాపూర్ కు చెందిన వ్యక్తి ఆత్మహత్య
రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ముంజం సంతోష్ అనే వ్యక్తి ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.