ఖమ్మం అర్బన్: సీపీఐ సంస్థాగత నిర్మాణంపై కార్యాచరణ రూపొందించాలి: జాతీయ సమితి సభ్యులు హేమంతరావు
భారత కమ్యూనిస్టు పార్టీ సంస్థాగత నిర్మాణం,పార్టీ విస్తృతికై కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ శతాబ్ది ఆవిర్భావ ఉత్సవాల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు ఉండాలన్నారు. సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం స్థానిక గిరిప్రసాద్ భవన్ లో రంజిత్ కుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ ఇది మహాసభల సంవత్సరమని ప్రజా సంఘాల మహాసభలతో పాటు పార్టీకి సంబంధించి శాఖ, మండల, జిల్లా మహాసభలు నిర్వహించాల్సి ఉందన్నారు.