నేలకొండపల్లి: మద్దులపల్లి మార్కెట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి....
యాంకర్... మార్కెట్ పనులను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జి దయాకర్ రెడ్డి అధికారులకు సూచించారు.శనివారం మద్దులపల్లి మార్కెట్ నిర్మాణ పనులు పున: ప్రారంభం అయ్యాయి.పెండింగ్లో ఉన్న పనులను కొబ్బరికాయ కొట్టి మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పునః ప్రారంభించారు.పెండింగ్ పనులను పరిశీలించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత బాధ్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రేస్ అధ్యక్షులు కల్లెం వెంకట్ రెడ్డి, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాధబాబు, డైరెక్టర్ పంతులు నాయక్, మద్ది మల్లా రెడ్డి పాల్గొన్నారు