వెంకటగిరి కోర్టు ఆవరణంలో సీనియర్ సిటిజన్ యాక్ట్-2007 పై జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ అవగాహన సదస్సు
Gudur, Tirupati | Nov 17, 2025 వెంకటగిరి పట్టణంలోని కోర్టు ఆవరణంలో జూనియర్ సివిల్ జడ్జి విష్ణు వర్మ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ యాక్ట్-2007 పై అవగాహన సదస్సును జరిగింది. జడ్జి విష్ణువర్మ మాట్లాడుతూ.. సీనియర్ సిటిజనులకు రైల్వే, ఆర్టీసీ, తదితర వాటిల్లో రాయితీలు ఉన్నాయన్నారు. ఈ రాయితీల్లో ఏవైనా సమస్యలు ఉంటే అర్జీ రూపంలో కోర్టులో అందజేస్తే తగు చర్యలను తీసుకుంటామని తెలియజేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్-2007 పై పలు విషయాలను వివరించారు.