రాజేంద్రనగర్: చేవెళ్ల పరిధిలో మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం, రోడ్లన్నీ జలమయం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొహినాబాద్ మండల పరిధిలోగల పలు గ్రామాలలో సోమవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా వర్షపు జల్లులు కురుస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ అకాల వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవ్వడంతో రోడ్లన్నీ కూడా జలమైనట్లు పేర్కొన్నారు. వాహనదారుల రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు