గిలకలదిండిలోని సైక్లోన్ సెంటర్లో పోర్టు వర్కర్స్ అవగాహన సదస్సు: ఆల్ ఇండియా పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, రాష్ట్ర చైర్మన్
Machilipatnam South, Krishna | Sep 24, 2025
స్తానిక మచిలీపట్నం గిలకలదిండిలోని సైక్లోన్ సెంటర్లో పోర్టు వద్ద ఆల్ ఇండియా పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, రాష్ట్ర చైర్మన్ షేక్ ఖళీఫతుల్లా భాష ఆధ్వర్యంలో పోర్టు వర్కర్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మిడియాతో మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులు, కార్మికులకు అనేక పథకాలు అందిస్తున్నాయని ఆన్నారు. మత్స్యకారులు, కార్మికులకు లబ్ది చేకూరట్లేదని మా దృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకనే మత్స్యకారులు, పోర్టు కార్మికులకు శ్రేయస్సుకు రాష్ట్రంలో ఉన్న 7 పోర్టులకు పర్యటిస్తున్నా అని తెలిపారు