తాడిపత్రి రూరల్ పరిధిలోని చేనేత కాలనీ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఏ టీ ఎం ను ఓ వ్యక్తి పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముంబై సెక్యూరిటీ ఆఫీసు నుంచి పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. సీఐ శివ గంగాధర్ రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి వెంటనే చేనేత కాలనీకి వెళ్లారు. పోలీసులు రాకను గమనించిన దొంగ అక్కడి నుంచి పరారీ కావడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు వెంటపడి పట్టుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది.