వెంకటగిరి పోలేరమ్మ ఆలయం వద్ద తనిఖీలు
Gudur, Tirupati | Nov 14, 2025 ఢిల్లీలో సోమవారం సాయంత్రం పేలుడు జరిగిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ చేసింది. ఈ సందర్భంగా సీఐ ఏవీ రమణ వెంకటగిరిలోని పోలేరమ్మ ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.