జన్నారం: రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన పెన్షన్ల పెంపును వెంటనే అమలు చేయాలి: ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ప్రభుదాస్
రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన పెన్షన్ల పెంపును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలంలోని దివ్యాంగులు,వృద్ధులు,బీడీ కార్మికులు స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ప్రభుదాస్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు అన్ని విధాల పెన్షన్లను పెంచుతున్నట్లు ప్రకటించి ఇప్పుడు ఏళ్లు గడుస్తున్న పెన్షన్ల పెంపులో జాప్యం చేయడం సరికాదని వెంటనే పెంచిన పెన్షన్లుతో కూడిన పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్ అందక వివిధ పెన్షన్ దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.