శ్రీకాకుళం: శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అర్జీలను స్వేకరించాలి : జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్
ప్రజా పిర్యాదుల నమోదు మరియు పరిష్కర వేదిక కార్యక్రమంకు వచ్చిన పిర్యాదులను శాశ్వత పరిస్కారమే లక్ష్యంగా అర్జీలను స్వీకరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పండ్కర్ అధికారులకు తెలిపారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా పిర్యాదుల నమోదు మరియు పరిష్కర వేదిక కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలసి కలెక్టర్ పాల్గుని ప్రజల నుండి పిర్యాదులను స్వీకరించారు. మొత్తం 94 అర్జీలను స్వీకరించి నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.