ధర్మారం: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ధర్మారం మండలానికి చెందిన ఎర్రం సంజీవ్ నియామకం
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఎర్రం సంజీవ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మంగళవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గొప్ప బాధ్యతలు అప్పగించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.