మార్కాపురం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి రథోత్సవం ప్రారంభించారు. వేణుగోపాల స్వామిని రథంపై పురవీధులలో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తుల అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.