తాడికొండ, ఇరిడి లో జరిగిన కందికొత్తలు సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జగదీశ్వరి
గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామంలో గిరిజన సంప్రదాయ సంబరాలు శుక్రవారం జరిగిన కంది కొత్తల పండగ కురుపాం ఎమ్మెల్యే టి.జగదీశ్వరి పాల్గొన్నారు. ముందుగా కోరికలు తీర్చే కల్పవల్లి ఇరిడి గ్రామ సమీపంలో వెలసిన కప్పరమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామంలో తోటి మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యాలు వేశారు.