యాడికి మండల కేంద్రంతో పాటు రాయల చెరువులో టీ కేఫ్ లలో గంజాయి విక్రయిస్తున్నారనే అనుమానంతో పోలీసులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది యాడికి, రాయల చెరువులలోని సుమారు 10 టీ కేఫ్ లు తనిఖీ చేశారు. అయితే ఎక్కడ కూడా గంజాయి పట్టుబడలేదని సీఐ చెప్పారు. ఎవరైనా, ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.