దుబ్బాక: పట్టణంలో పోచమ్మ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
దుబ్బాక ప్రజలు గర్వపడేలా, ఆలయ వైభవం ఉట్టిపడేలా దుబ్బాకలో పోచమ్మ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించుకుందామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దుబ్బాక పట్టణంలో పోచమ్మ తల్లి దేవాలయానికి ఎంపీ రఘునందన్ రావు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య లతో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పోచమ్మ తల్లి అంటే అన్ని కులాల వారికి ఆరాధ్య దైవమని, అందరం పోచమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుంటామన్నారు..రాజకీయాల్లోకి రాకముందే దుబ్బాకలోని వెంకటేశ్వర దేవాలయ నిర్మాణం కు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్