దళితులపై దాడి చేసిన అగ్రకులస్తులను కఠినంగా శిక్షించాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రమేష్ మాదిగ
Chittoor Urban, Chittoor | Nov 18, 2025
చిత్తూరు దళితులపై దాడి చేసిన అగ్రకులస్తులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఏపీ ఎమ్మార్పీఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు టి రమేష్, మాదిగ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ ప్రసాద్ చిత్తూరు లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా బండ్లమూడి దళితవాడలో అగ్రకులస్తులు దాడి చేసి వారం రోజులవుతున్న ఇంతవరకు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. దళితుల పొలంలో అగ్రకులస్తుల గొర్రెలు పంటను నాశనం చేసిందని ప్రశ్నించినందుకు దళితులపై దాడి చేయడం బాధాకరమన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ అనంతరం పోలీస