రాజంపేట: "అన్నదాత - సుఖీభవ రైతన్న మీకోసం " వర్క్ షాప్ లో పాల్గొన్న రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు
రాజంపేట మండలం - రాజంపేట నియోజకవర్గం.రాజంపేట. రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా ఉంటారని,ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చమర్తి జగన్ మోహన్ రాజు సూచించారు. బుధవారంరాజంపేటమండలం,హస్తవరం గ్రామం పర్యటిస్తూ "అన్నదాత సుఖీభవ - రైతన్న మీకోసం" వర్క్ షాప్ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షులు - నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు .పాల్గొని ఆయన రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.రైతుల సమస్యలపై చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వాటి పరిష్కారానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు