వెల్గటూరు: వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలెందర్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు. గ్రామంలోని ఎస్సి కాలనిలో రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బొప్పు తిరుపతి, మురళి గౌడ్ పాల్గొన్నారు.