ఎలమంచిలి: అచ్యుతాపురం బ్రాండిక్స్ వద్ద 220 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం
అచ్యుతాపురం బ్రాండిక్స్ వద్ద 220 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. వడగాల్పులు, వేడి వాతావరణం వల్ల రాత్రి 130 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. ఈ సమయంలో అక్కడ విధుల్లో ఆరుగురు ఉద్యోగులు ఉన్నారు. మంటలు ఉపకేంద్రంలోని మిగిలిన ట్రాన్స్‌ఫార్మర్లకు వ్యాపించకుండా అగ్నిమాపక వాహనాల ద్వారా అదుపు చేశారు. అనకాపల్లి ఈఈ రాజశే ఖర్, ఏఈ భాను ప్రకాశ్ ఆధ్వర్యంలో అత్యవసర మరమ్మతులు చేపట్టి రాత్రి 10గంటలకు సరఫరాను పునరుద్ధరించారు.