సాక్షులను అంతం చేసే వైసిపి పాత పద్ధతి పై విచారణ చేపట్టాలన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ
సాక్షులను అంతం చేసే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత పద్ధతిపై నిజమైన విచారణ జరిపించాలని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి కేసులో కీలకంగా ఉన్న మాజీ విజిలెన్స్ అధికారి వై.సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ చీకటి చరిత్రను మరోసారి గుర్తు చేస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే మాట్లాడారు. సాక్షులు అడ్డుగా ఉన్నారని భావించినప్పుడు వారిని అంతం చేయడమనేది వైసీపీకి పాత అలవాటని గుర్తు చేశారు. టీటీడీ పవిత్రతను కాపాడటానికి, అలాగే సతీ