ఈ నెల 10 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఆ మేరకు జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శనివారం ఉదయం 11 గంటలు విద్యా శాఖ కర్నూలు కలెక్టరేట్ లోని సమావేశంలో అధికారులను ఆదేశించారు. పేరెంట్-టీచర్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాలల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ తెలిపారు.