సంగారెడ్డి: మహిళలు అర్థికంగా బలపడితే కుటుంబాలు గ్రామాలు దేశం అభివృద్ధి చెందుతుంది : అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్
మహిళలు అధికంగా బలపడితే కుటుంబాలు గ్రామాలు దేశం అభివృద్ధి చెందుతుందని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఇందిరా అమ్మాయిల శక్తి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సద్వినియం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్, గ్రంథాల సంస్థ చైర్మన్ అంజయ్య, సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.