కుటుంబ కలహాలతో అనంతపురంలో పురుగుల మందు తాగి తల్లి బిడ్డ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన బుధవారం రాత్రి 11:30సమయంలో చోటు చేసుకుంది.ఉరవకొండ మండలం మైలారం పల్లి గ్రామానికి చెందిన హరిత అనే యువతీ నర్సింగ్ చదువుతోంది.తల్లి లక్ష్మీదేవితో కొంతకాలంగా చెప్పిన మాట వినడం లేదని ఇద్దరికీ గొడవలు జరిగేవి.ఈ నేపథ్యంలోనే అనంతపురంలోని అరవింద నగర్ లోఇరువురు గొడవ పడి లక్ష్మీదేవి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తాగుబోతుండగా, కూతురు హరిత లాక్కొని తాగింది.ఇద్దరు అపస్మార్క స్థితిలో పడి ఉండటంతో గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.గురువారం ఉదయం 10:30 రెండో పట్టణ కేసు నమోదు చేశారు.