రాజేంద్రనగర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాజులరామారానికి చెందిన మహేశ్(21) సాయికుమార్ (23) మహారాష్ట్రకు వెళ్లి అంజద్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఈ క్రమంలో హఫీజ్పేట్లోని రైల్వే స్టేషన్ సమీపంలో వారిని అరెస్ట్ చేసి, 140 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు