ధర్మారం: నంది మేడారం బాలుర గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఈ నెల 15న ఇంటర్వ్యూలు
ధర్మారం మండలం నందిమేడారంలోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో ఖాళీగా ఉన్న పిజీటీ, టీజీటీ ఇంగ్లీష్ పోస్టులకు ఈ నెల 15న డెమో, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ విద్యాసాగర్ శనివారం మధ్యాహ్నం తెలిపారు. ఎంఏ, బీఈడీ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని ఆయన పేర్కొన్నారు.