కాగజ్నగర్: గ్రామపంచాయతీ రికార్డులు పరిశీలించిన విజిలెన్స్ అధికారులు
సిర్పూర్ (టి) మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ రికార్డులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు అధికారులు గ్రామ పంచాయతీకి చేరుకొని వివిధ పత్రాలు, లెక్కల వివరాలు, రికార్డులు తనిఖీ చేశారు. విజిలెన్స్ డివిజనల్ ఇంజనీర్ మాట్లాడుతూ — “ప్రాథమికంగా రికార్డులను పరిశీలించాం, మళ్లీ ఫీల్డ్ ఎంక్వయిరీ కోసం త్వరలో వస్తాం” అని తెలిపారు