సిర్పూర్ టి: కాగజ్నగర్ మండలంలో విద్యార్థుల ఆరోగ్యం పై అదనపు కలెక్టర్ & జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి ప్రత్యేక సమీక్ష
అసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మరియు జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి బుధవారం కాగజ్నగర్ మండలం పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించారు. విద్య బోధన, వసతులు, మధ్యాహ్నం భోజనం నాణ్యత, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించి విద్యార్థుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బాలికల భద్రత వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు,