ధర్మపురి: మాజీ వైస్ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మారం మాజీ వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి తండ్రి మేడవేణి చిన్నయ్య మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మృతుడు చిన్నయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.