కామేపల్లి: హైకోర్టు ఉత్తర్వుల మేరకు కామేపల్లి జూనియర్ కళాశాల గెస్ట్ లెక్చరర్స్కి ఉద్యోగ భద్రత కల్పించాలి: ఆ సంఘం రాష్ట్ర నేత రషీద్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1,654మంది గెస్ట్ లెక్చరర్స్కి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. 10సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా రెగ్యులర్, కాంట్రాక్టు లెక్చరర్లతో సమానంగా పనిచేస్తూ సంవత్సరంలో 7, 8నెలల జీతం మాత్రమే తీసుకుంటున్నామని రాష్ట్ర నాయకుడు ఎండి రషీద్ ఆవేదన వ్యక్తం చేశారు. కామేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాట్లాడిన ఆయన చాలీచాలని జీతాలతో కుటుంబం గడవడమే కష్టంగా ఉందన్నారు.