పెగడపల్లె: నంచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మధుసూదన్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.