కలువాయిలో అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
Gudur, Tirupati | Nov 15, 2025 కలువాయి మండలం చీపినాపీ సమీప పొలాల్లో అక్రమంగా క్వార్ట్జ్ తవ్వి తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామానికి ఆనుకుని ఉన్న అటవీ భూములు, ప్రభుత్వ స్థలాల నుంచి భారీగా క్వార్ట్జ్. తీసుకువచ్చి రోజూ గ్రేడింగ్ చేస్తున్నారు. ట్రాక్టర్లు, లారీల్లో రాత్రింబవళ్లూ రాళ్లు తరలిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.