ములుగు: మాకు ఇంటి స్థలాలు కేటాయించి, ఇల్లు నిర్మించాలి: ములుగులో ట్రాన్స్ జెండర్లు
Mulug, Mulugu | Sep 15, 2025 తమకు ఇంటి స్థలాలు కేటాయించాలని ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం ట్రాన్స్ జెండర్లు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా తల్లిదండ్రులకు, సమాజానికి దూరంగా దుర్భర జీవితాలు గడుపుతున్నామన్నారు. తమను గుర్తించి ఏటూరునాగారంలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలం కేటాయించి, ఇల్లు నిర్మించాలని కోరారు.