పూరిల్లు దగ్ధమైన బాధితులకు ఆర్థిక సహాయం అందజేసిన వైస్ చైర్మన్ షేక్ రఫీ
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని లోతువాని గుంటలో గ్యాస్ సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధమైన బాధితురాలు సుబ్బమ్మకు నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సోమవారం ఆయన స్థానిక టిడిపి నేతలతో కలిసి లోతు వానిగుంట లోని బాదితురాలు నివాసానికి చేరుకుని దగ్ధమైన పూరిల్లు ను పరిశీలించారు. అనంతరం తన వంతు సహాయంగా పదివేల రూపాయల నగదును అందజేశారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో సుబ్బమ్మ ఇల్లు పూర్తిగా, పక్కనే ఉన్న రవణమ్మ పాక్షికంగా దగ్ధ మవడాన్ని పరిశీలించిన మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ వారికి పక్కా ఇళ్లు మంజూరు చేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తెలుగుదే