పెద్ద కడబూరు : మండల పరిధిలోని పీకలబెట్టలో ఆదివారం మొహర్రం వేడుకలు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున హసేన్ హుస్సేన్ తాతా గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి వారికి పూజలు నిర్వహించారు . అనంతరం నిప్పుల గుండంలో కూర్చొని రొట్టెలు కాల్చారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.