శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండల పరిధిలో అక్రమ లేఔట్లలో నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గురువారం మండల తహసిల్దార్ దేవేంద్ర నాయక్, డిప్యూటీ ఎంపీడీవో మాధవరెడ్డి లు హెచ్చరించారు. తహసిల్దార్ కార్యాలయ సమీపంలో అక్రమ లేఔట్లలో ఇంటి నిర్మాణం జరుగుతున్న విషయం తెలుసుకొని వాటిని వారు పరిశీలించారు. అక్రమ లేఔట్లలో నిర్మాణాలు చేపడితే నీటి వసతి, కరెంటు సదుపాయం కల్పించబోమని తెలిపారు.