అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కొమరాడలో ప్రభుత్వాన్ని కోరిన సిఐటియు నేతలు
అంగన్వాడీల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించే దిశగా ఆలోచించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాకాడ ఇందిరా , సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి సోమవారం మధ్యాహ్నం కొమరాడలో ప్రభుత్వానికి కోరారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ అంగన్వాడి అండ్ హెల్పర్స్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారి సమస్యలు పరిష్కరించాలనన్నారు. అంగన్వాడి సెంటర్ల వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు.