మేడ్చల్ జిల్లా నాగారంలో ఆగి ఉన్న లారీని డివైడ్ గ్రేస్ స్కూల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్సులో కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారని, వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కీసర పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.