ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్ దాదాపు పూర్తయిందని టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆదివారం ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ వాయిదా పడినట్లు పేర్కొన్నారు. ప్రారంభించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. త్వరలో అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.