వెల్గటూరు: మా ఊర్లో ఆర్టీసీ బస్సు ఆపండి... నిరసన తెలిపిన గ్రామస్తులు..!
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసి బస్ స్టాప్ వద్ద ఎక్స్ ప్రెస్ బస్సులు ఆపాలని డిమాండ్ చేస్తూ పలువురు గ్రామస్తులు, మాజీ ప్రజా ప్రతినిధులు నిరసన తెలిపారు. కరీంనగర్ నుండి రాయపట్నం వెళ్లే రాష్ట్ర రహదారి పక్కనే ఉన్న ఎండపల్లి బస్ షెల్టర్ వద్ద, ఆర్టీసీ బస్సులు నిలపడం లేదంటూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.నూతనంగా ఏర్పడిన ఎండపల్లి మండల కేంద్రంలోని బస్సు షెల్టర్ వద్ద బస్సులు ఆపకపోవడంతో ప్రజలు,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.