విజయనగరం: రాజాం పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పలు ఇళ్లల్లో చేరిన వర్షం నీరు
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి పలు ఇళ్లల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్థానిక మల్లయ్యపేట వీధిలో డ్రైనేజ్ కాలువకు అడ్డంగా ఐరన్ గేటు వేయడంతో ఇళ్లల్లోకి వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టి నీటిని మళ్లించే ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.