మార్కాపురం మండలం బోడపాడు గ్రామానికి చెందిన బాధితులు తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్ మరియు పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అన్నదమ్ముల కుటుంబంలో ఎవరి వాటాలు వాళ్ళు పంచుకొని 32 సంవత్సరాలు అయిందని అయితే పెద్దాయన ఆస్తి అమ్ముకొని మా ఆస్తిని కూతురికి రాసి ఇవ్వడం అన్యాయమని బాధితులు వాపోయారు. గత సంవత్సర కాలం గడిచిన ఎటువంటి ప్రయోజనం లేదని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.