నెల్లిమర్ల: నెల్లిమర్లలో 19న ఎన్ డిఎ అభ్యర్థి లోకం నాగ మాధవి నామినేషన్
నెల్లిమర్ల ఈనెల 19న నెల్లిమర్ల నియోజకవర్గం ఎన్ డిఎ అభ్యర్థి లోకం నాగ మాధవి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నాగ మాధవి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి 2019లో జనసేన తరపున ఎమ్మెల్యే గా పోటీ చేశారు. త్రిముఖ పోటీలో సుమారు 8వేలు ఓట్లు తెచ్చుకున్నారు. ఈ సారి కూటమి అభ్యర్థిగా పోటీలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ప్రచారంలో దూసుకుపోతున్నారు.