అసిఫాబాద్: అత్యల్పంగా సిర్పూర్ లో 7.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
ఆసిఫాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జిల్లాలోని సిర్పూర్ లో అత్యల్పంగా 7.4 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాగల రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని చెప్పారు.