సిర్పూర్ టి: స్పందించిన అధికారులు, రుద్రాపూర్ సెక్రికేషన్ షెడ్డు కు మరమ్మత్తులు
చింతల మానేపల్లి మండలంలోని రుద్రాపూర్ గ్రామంలో గల సెక్రికేషన్ షెడ్డు పైకప్పు గత కొద్ది రోజుల క్రితం ఎగిరిపోయింది. దీంతో నిరుపయోగంగా మారిన సెక్రికేషన్ షెడ్డు రేకులను బాగు చేసి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు అధికారులకు తెలియజేయడంతో స్పందించిన అధికారులు సెక్రికేషన్ పైకప్పుకు రేకులు వేసి మరమ్మతులు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారుల సెక్రికేషన్ షెడ్ ను వినియోగంలోకి తీసుకురావాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు,