ప్రకాశం జిల్లా ప్రజలు ఈసారి సంక్రాంతి పర్వదినాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి రోజున కోడి పందాలతో సందడి చేస్తుంటే, ప్రకాశం జిల్లాలో మాత్రం బుధవారం కోడి పందాలు తో పాటు సముద్రంలో పడవల పోటీలతో పండుగను ఘనంగా నిర్వహించారు. కొత్తపట్నం మండలం మడనూరు సముద్ర తీరంలో తొలిసారిగా మరపడవల పోటీలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వినూత్న కార్యక్రమంలో మొత్తం 14 పడవలు పాల్గొనగా, సుమారు 30 మంది పడవదారులు పోటీలో తమ ప్రతిభను ప్రదర్శించారు. అలల మధ్య వేగంగా దూసుకెళ్లిన పడవలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ పడవల పోటీలను తిలకించేందుకు ప్రజల భారీ ఎత్తున వచ్చారు