ధర్మారం: ధర్మారం మండల వ్యాప్తంగా ఘనంగా గణపతి నిమజ్జన వేడుకలు, అలరించిన విద్యార్థుల నృత్యాలు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. నవరాత్రులు పూర్తి చేసుకొని, గంగమ్మ చెంతకు వెళ్లనున్న గణపతికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడ్రన్ స్కూల్ లో కొలువైన మట్టి గణపతిని, అక్కడి విద్యార్థులు నిమజ్జనానికి తరలించారు. పాటశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో భక్తి పాటలకు చిరుతలతో నృత్యాలు చేస్తూ గననాథుడికి సాగనంపారు. అనంతరం వెల్గటూర్ మండలం కోటిలింగాల వద్ద నున్న గోదావరి నదిలో నిమజ్జనం చేసారు.