కూకట్పల్లి: కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో యువకుడికి విద్యుత్ షాక్ , సిపిఆర్ చేసి కాపాడిన స్థానికులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భాగ్యనగర్ కాలనీ వద్ద మంగళవారం రాత్రి వేణు అనే వ్యక్తికి విద్యుత్ షాక్ తగలడంతో ఆకస్మాత్తుగా పడిపోయాడు. దీంతో అతడికి స్థానికులు సిపిఆర్ చేసి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.