కొర్రపాడులో ఇంటి దగ్గర కూర్చొని ఉండగా ఓ వ్యక్తిపై రమేష్ అనే వ్యక్తి కొడవలితో దాడి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Mar 1, 2026
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు లో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో పెద్ద నరసింహులు అనే వ్యక్తి ఇంటి దగ్గర కూర్చొని ఉండగా రమేష్ అనే వ్యక్తి కొడవలితో దాడి చేసి పరారయ్యాడు. పెద్ద నరసింహులకు తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నదని వైద్యులు రామాంజనేయులు తెలిపారు.