బ్రిటీష్ వారిపై వీరోచితంగా పోరాడి అమరుడైన వడ్డే ఓబన్న పోరాటం యావత్తు తెలుగుజాతి గర్వించదగ్గదని ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 11:30 గంటల సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర్ రెడ్డి, ఆర్ ఐ పవన్ కుమార్ లు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఏ.ఆర్ డీఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఉయ్యాలవాడ నరసింహరెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అని కొనియాడారు.